చిలకలూరిపేట: పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్ వైద్య సేవలకు మరో మణిహారం లభించింది. హై-రిస్క్ (High-Risk) గర్భంతో బాధపడుతున్న ఒక మహ...
చిలకలూరిపేట: పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్ వైద్య సేవలకు మరో మణిహారం లభించింది. హై-రిస్క్ (High-Risk) గర్భంతో బాధపడుతున్న ఒక మహిళ, వైద్య నిపుణురాలు డా. లావు సుష్మ గారి పర్యవేక్షణలో సురక్షితంగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
*కుటుంబంలా మారిన రోగులు, డాక్టర్లు:ఆనందకరమైన అనుభూతి*
ఈ సందర్భంగా డాక్టర్ సుష్మ మాట్లాడుతూ, "రోగులు కేవలం రోగులు కాదు, మా కుటుంబ సభ్యులుగా మారినప్పుడు కలిగే సంతోషకరమైన అనుభూతి మాటల్లో చెప్పలేం. మాతాశిశువు క్షేమంగా ఉన్నారని తెలిసిన ఆ క్షణం, వైద్యులకు అత్యంత సంతృప్తినిస్తుంది" అని తెలిపారు.
హై-రిస్క్ గర్భం కారణంగా తల్లి ఆరోగ్యంపై ఆందోళన నెలకొన్నప్పటికీ, లీలావతి హాస్పిటల్స్ బృందం తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తలు, అధునాతన వైద్య సేవలతో చివరకు మగబిడ్డ పుట్టాడు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. డా. లావు సుష్మ గారి ఆధ్వర్యంలో ఈ విజయం సాధించినందుకు ప్రజలు హాస్పిటల్ సేవలను అభినందిస్తున్నారు.
COMMENTS