రేపు జిల్లాకు రానున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్...
రేపు జిల్లాకు రానున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.
చిలకలూరిపట్టణంలోని శ్రీ శారద జెడ్పీ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు.
గురువారం మధ్యాహ్నం శారద జెడ్పీ పాఠశాల వద్ద జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని, ఇతరులు కార్యక్రమానికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణారావు, డీఆర్వో మురళి, డీఈవో చంద్రకళ, ఆర్డీవో మధులత ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS