నాయక చవితి వచ్చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గణేశ్ చతుర్థి సందడి మొదలయ్యింది అయింది. ఇంకా కొన్ని రోజుల్లో ఏ వీధిలో చూసినా గణే...
► గణేశ్ మండపాలను ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయరాదు.
►మండపాల వద్ద మద్యం సేవించరాదు. జూదం ఆడరాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
►మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు వలంటీర్ల పేర్లను నమోదు చేసి సంతకం తీసుకోవాలి.
►మండపాలను గాలి, వానకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు ఏర్పా టు చేయాలి. వలంటీర్లు భక్తులను తనిఖీ చేశాకే మండపం వద్దకు పంపాలి.
►మండపంలోకి ఎలాంటి మండే పదార్థాలు లేదా పటాకులు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూనెతో వెలిగించే దీపాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
►మండపాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా వీడియో కెమెరాలు, సీసీటీటీలు ఏర్పాటు చేసుకోవాలి.
►రాత్రి వేళ మండపంలోకి పశువులు, కుక్కలు చొరబడకుండా అడ్డుగా కంచె ఏర్పాటు చేసుకోవాలి.
►సౌండ్ బాక్స్‌లను స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఉపయోగించరాదు.
►శబ్ధ స్థాయిలను అనుమతించదగిన ప రిమితుల్లోనే ఉంచాలి. భారత సర్వోన్న త న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు.
►మండపాల వద్ద ఎలాంటి అసభ్యకరమైన పాటలు, ప్రకటనలు చేయకుండా భక్తి పాటలను మాత్రమే ప్లే చేయాలి.
►ఏదైన సమాచారం కోసం డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి.
COMMENTS