ముఖ్యఅతిథిగా వేమూరు శాసన సభ్యులు,నక్కా ఆనందబాబు. ప్రత్యేక ఆహ్వానతులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ. గుంటూర...
ముఖ్యఅతిథిగా వేమూరు శాసన సభ్యులు,నక్కా ఆనందబాబు.
ప్రత్యేక ఆహ్వానతులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ.
గుంటూరు: దళితరత్న, గుంటూరు మాల మహానాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు కొర్రపాటి చెన్నకేశవులు 9వ సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై సభలో అడపా మోహన్ మాదిగ మాట్లాడుతూ, చెన్నకేశవులు ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని కొనియాడారు. ఆయన ఒక కులానికి మాత్రమే పరిమితం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరి ఏకీకృత శక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. చెన్నకేశవులు తమతో సుమారు 10-17 ఏళ్లుగా నిద్రపోయే సమయం తప్ప మిగతా అంతా కలిసి ఎంఆర్‌పిఎస్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తుచేసుకున్నారు."చెన్నకేశవులు అందరికీ నాయకత్వాన్ని అలవాటు చేశారు. ఎవరు సమస్యతో వచ్చినా, వాడే నాయకుడు అని చెప్పి, వారి సమస్యల మీద పోరాటం చేసే విధంగా వారిని తయారుచేసిన వ్యక్తి," అని మోహన్ మాదిగ అన్నారు. జాతుల కోసం పనిచేసిన చెన్నకేశవులు ని, ఆయనకన్నా ముందు పనిచేసిన శెట్టి కర్మరాజు ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ని ఉద్దేశిస్తూ, అంబేద్కర్ భవనం ముందు చెన్నకేశవులు కి ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ విగ్రహం ద్వారా తమ మిత్రుడిని రోజు చూసుకునే విధంగా ఉంటుందని కోరుకుంటూ, ఆనందబాబు ఈ పని చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సభలో వివిధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
COMMENTS