ప్రతి మహిళకు 16 రకాల ఉచిత టెస్టులు చిలకలూరిపేట పట్టణంలోని డ్వాక్రా గ్రూపుల్లోని 35 ఏళ్లు నిండిన మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ...
ప్రతి మహిళకు 16 రకాల ఉచిత టెస్టులు
చిలకలూరిపేట పట్టణంలోని డ్వాక్రా గ్రూపుల్లోని 35 ఏళ్లు నిండిన మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అండగా నిలిచింది.ఇందులో భాగంగా, ప్రతి మహిళకు 16 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ రఫానీ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని 'సఖి సురక్ష' పేరుతో గురువారం చిలకలూరిపేటలో ప్రారంభించారు. పరీక్షలు చేయించుకున్న మహిళలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు మరియు వైద్య రిపోర్టులు వాట్సప్ ద్వారా అందజేస్తామని సిబ్బంది పేర్కొన్నారు.
COMMENTS