యడ్లపాడు: మండలంలోని జగ్గపురం గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు త్వరలోనే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట...
యడ్లపాడు: మండలంలోని జగ్గపురం గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు త్వరలోనే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని నరసరావుపేట ఆర్డిఓ మధులత చెప్పారు. యడ్లపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా రెవిన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం జగ్గాపురం గ్రామానికి వెళ్లి గతంలో ఎస్సీ కాలనీ వాసుల కోసం ప్రభుత్వం భూసేకరణ చేసిన నివేశన స్థలాలను పరిశీలించారు. స్థలం వివరాలు, పంపిణీ చేసిన వారి జాబితాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఆమెను కలిసి సుదీర్ఘకాలంగా ఇళ్ళ స్థలాల కోసం నిరీక్షిస్తున్నామని వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ భూసేకరణ కింద ప్రభుత్వం నగదు చెల్లించిన భూములను అర్హులైన వారిని గుర్తించి వేగవంతంగా పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే గతంలో జాబితాను పరిశీలిస్తామని అదే విధముగా స్థలాలు లేని వారంతా తాజాగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఆయా పేర్లను అర్హతను గుర్తించి వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.తదుపరి స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల కొద్ది స్థలంలోనే నిర్మించారని దానిని పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆర్డీవో దృష్టికి తెచ్చారు. గ్రామంలో అంగన్వాడి శాశ్వత భవనం కూడా లేదని దాన్ని కూడా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు. ప్రజల నుండి తెలుసుకున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. జిల్లాలో నివేశన స్థలాల వివాదాలతో కోర్టులో పెండింగ్ ఉన్న వాటిని కూడా త్వరలోనే కౌంటర్ వేసి ఆయా పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించి పంపిణీ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మండలం పరిధిలో 12 గ్రామ సచివాలయాల ద్వారా 968 నివేసిన స్థలాలు కావాలని అర్జీలు అందాయని వాటిని పరిశీలించగా 204 అర్హులుగా గుర్తించమన్నారు. వీరందరికీ ఆయా గ్రామాల సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించి పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని లేకుంటే ప్రైవేటు భూములను సేకరించే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. టిడిపి నాయకులు ముద్దన నాగేశ్వరావు గ్రామంలోని సమస్యలను ఆర్డిఓ మధులత దృష్టికి తీసుకువచ్చారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డిఓ వెంట యడ్లపాడు తహసిల్దార్ జె విజయ శ్రీ ,ఆర్ ఐ సుబ్బారావు, డిటి అనురాధ, మండల సర్వేయర్ సురేంద్రనాథ్, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.
COMMENTS