చిలకలూరిపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమా...
చిలకలూరిపేట:
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ప్రజా స్పందనలభించిందని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు.బుధవారం చిలకలూరిపేటలోని వైఎస్ఆర్సీపీ క్యాంపుకార్యాలయం వద్ద 63,511 సంతకాల ప్రతులను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని అన్నారు.ఈ నెల 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి, 17న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసివిజయవాడలో రాష్ట్ర గవర్నర్‌కు కోటి సంతకాల వినతులను సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
COMMENTS