చిలకలూరిపేట పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్...
చిలకలూరిపేట పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
చిలకలూరిపేటనియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మొత్తం 64,511 సంతకాలు సేకరించినట్లు వెల్లడించారు.రజిని తెలిపారు,కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో, వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టిందని చెప్పారు.సేకరించిన సంతకాలను త్వరలోనే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించనున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఒక పోలీసు అధికారి కుమారుడు కావడం దురదృష్టకరమని, ప్రభుత్వం చట్ట ప్రకారం తగిన చర్యలుతీసుకోవాలని కోరారు. పోలీసులు తమ సహోద్యోగుల పిల్లలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడమే పోలీసుల పని అయిందని ఆమె ఆరోపించారు. ఐదుగురు కుటుంబాల్లో విషాదం నింపిన వారిని కఠినంగా శిక్షించాలని,అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కుటుంబాలకు సహాయం అందించాలన్నారు.
బీసీ మహిళపై తప్పుడు ప్రచారం చేయడం టీడీపీ నేతల లక్ష్యమని వ్యాఖ్యానించారు. చిలకలూరిపేట నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్నవదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
COMMENTS