పల్నాడు జిల్లాలోని ప్రఖ్యాతి చెందిన దుర్గి శిల్ప కళ ఓ అద్భుతమని, కళాకారుల కష్టం వల్లే యంత్రాల కాలంలో సైతం దుర్గిలో శిల్ప కళ(చేతి...
పల్నాడు జిల్లాలోని
ప్రఖ్యాతి చెందిన దుర్గి శిల్ప కళ ఓ అద్భుతమని, కళాకారుల కష్టం వల్లే యంత్రాల కాలంలో సైతం దుర్గిలో శిల్ప కళ(చేతివృత్తి) నేటికీ బ్రతకగలుతోందని కితాబిచ్చారు.దుర్గి శిల్పాల పరిమాణం తగ్గించి, అందరి ఇళ్లలో,కార్యాలయాల్లో భాగమయ్యేలా చేస్తే మార్కెట్ పెరుగుతుందన్నారు.
జాతీయ హస్తకళల వారోత్సవాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం దుర్గి మండల కేంద్రంలో శిల్ప కళా శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రెండు నెలల పాటూ లేపాక్షి సిబ్బంది కళాకారులకు శిక్షణ ఇస్తారన్నారు. భారీ స్థాయిలో ఉంటూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వస్తున్న దుర్గి శిల్పాలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, అన్ని రకాల పరిమాణాల్లో తయారు చేయడంపై శిక్షణ ఉంటుందన్నారు.
శిల్ప కళ అభివృద్ధికి స్థలాలు ఇస్తామని, అన్ని కాలాల్లో ముడి సరుకు అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు. కళాకారులు సౌకర్యవంతంగా తమ పని చేసుకునేందుకు అవసరమైన పరికరాలు అందిస్తామన్నారు. శిల్ప కళాకారులకు ఇళ్ల పట్టాలు అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళీ కృష్ణ, లేపాక్షి శిక్షకులు, కళాకారులు పాల్గొన్నారు.
COMMENTS