ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి: సిఐ పి.రమేష్ చిలకలూరిపేట :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట...
ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి: సిఐ పి.రమేష్
చిలకలూరిపేట :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ–4 కార్యక్రమంలో భాగంగా,మాజీ మంత్రి, ప్రస్తుత చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో 38వ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా పట్టణ సిఐ పి.రమేష్ మాట్లాడుతూ ఈ శిబిరం రాబోయే ఆదివారం (డిసెంబర్ 7, 2025)న చిలకలూరిపేట పత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడనుంది.ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యం వినికిడి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో ఆడియోమెట్రిక్ టెస్టులు నిర్వహించడంతో పాటు, సమస్య తీవ్రతను బట్టి రూ.5,000 నుండి రూ.20,000 వరకు విలువ చేసే వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ సేవలను పొందదలచిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే గతంలో చేసిన పరీక్షా రిపోర్టులను తీసుకురావాలని సూచించారు. టెస్టులు చేయించని వారికి శిబిరంలోనే పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయబడ్డాయి అన్నారు.మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పటికే ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారని, “పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం నా జీవితంలో అత్యంత తృప్తినిచ్చే పని” అని ఆయన పేర్కొన్న మాటలతో పట్టణ సీఐ పి. రమేష్ ప్రస్తావించారు.చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ‘వినికిడి లేని ప్రాంతం’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మెగా వైద్య శిబిరం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
COMMENTS