సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్ పెట్టాలంటే 2000 వేలు చెల్లించవలసిందేనా! చిలకలూరిపేట నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్ల ...
సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్ పెట్టాలంటే 2000 వేలు చెల్లించవలసిందేనా!
చిలకలూరిపేట నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్ల బిల్లుల విషయంలో ట్రెజరీ కార్యాలయంలో ఇంక్రిమెంట్ బిల్లులు పాస్ చేయడానికి ఒక్కో సచివాలయం నుంచి సుమారు 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంక్రిమెంట్ బిల్లుల కోసం వసూలా.....
సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల ఇంక్రిమెంట్లు మంజూరు చేసింది. ఈ ఇంక్రిమెంట్లను కలిపి బిల్లులు ట్రెజరీ కార్యాలయంలో పెట్టడానికి, ప్రతి సచివాలయం నుంచి 2 వేల డిమాండ్ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలో 29, నాదెండ్లలో 16, ఎడ్లపాడులో 12, చిలకలూరిపేట రూరల్‌లో 15 సచివాలయాలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 72 సచివాలయాలు ఉన్నాయి. ఒకవేళ ఒక్కో సచివాలయం నుంచి 2000₹ వసూలు చేస్తే, మొత్తం సుమారు 1,44,000₹అవుతుందనిఉద్యోగులువాపోతున్నారు.
ప్రతిసారి ఇంక్రిమెంట్ బిల్లుల విషయంలో ఇలాంటి డిమాండ్లుఎదురవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ అక్రమ వసూళ్ల వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ విషయం పై సంబంధిత అధికారీనీ వివరణ కోరడానికి ప్రయత్నించగా సంబంధిత అధికారి అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
COMMENTS