చంద్రబాబు సమర్థత... నాయకత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం : ప్రత్తిపాటి. శ్రేణులు ప్రజల తలలో నా...
చంద్రబాబు సమర్థత... నాయకత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం : ప్రత్తిపాటి.
శ్రేణులు ప్రజల తలలో నాలుకగా వ్యవహరిస్తే పార్టీకి తిరుగుండదు.
మూడు పార్టీల ఐక్యత.. పనితీరు.. ప్రజలతో వ్యవహరించే తీరే ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది.
జగన్ మిగిల్చిన అప్పులభారం.. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ప్రజల సంతోషమే లక్ష్యంగా వారికిచ్చిన హామీల అమల్లో చంద్రబాబు దేశానికే మార్గదర్శిగా నిలిచారని, తల్లికి వందనం, స్త్రీశక్తి (ఉచిత బస్సు పథకం), దీపం-2.0 పథకాలతో మహిళల మనసులు చూరగొన్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శుక్రవారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శుల శిక్షణ శిబిరంలో సూపర్-6పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బృందాలవారీగా 3 గంటలపాటు పార్టీ క్యాడర్ కు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
నిరంతర శ్రామికుడు, వయసును సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆలోచనల్ని, ఆచరణాత్మక విధానాల్ని నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీ శ్రేణుల నిత్యకృత్యంగా మారాలని ప్రత్తిపాటి సూచించారు. పథకాల అమలుతో పాటు..18 నెలల్లో రాష్ట్రానికి రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సామాన్య విషయం కాదని, ఈ ఘనతలు చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమయ్యాయనే నిజాన్ని ప్రజలు గ్రహించేలా, వారికి అర్థమయ్యేలా గ్రామ, మండలస్థాయి నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు తెలియపరచాలన్నారు. పార్టీ నాయకత్వం తయారు చేసిన క్లస్టర్ వ్యవస్థ.. తమకే కేటాయించిన ప్రతి ఇంటితో నిత్యం సత్సంబంధాలు కలిగి, ప్రతి కుటుంబం లోని వారికి తలలో నాలుకలా వ్యవహరించాలని, అప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ఎన్నికల్లోనైనా పార్టీకి తిరుగుండదని ప్రత్తిపాటి సూచించారు. సూపర్ -6లో మిగిలిన ఒకటీ రెండు హామీల్ని కూడా ప్రభుత్వం అతిత్వరలోనే అమలు చేస్తుందని, అమలు కాని వాటిపై దుష్ప్రచారం చేసే వైసీపీ నేతలు, కార్యకర్తల నోళ్లు మూతపడేలా శ్రేణులు 18 నెలల్లో సాధించిన విజయాలు.. ప్రజల సంతృప్తి స్థాయితో సమాధానం చెప్పాలన్నారు.
*మూడు పార్టీల శ్రేణుల ఐక్యత..పనితీరే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాల్ని ప్రభావితం చేస్తుంది*
సూపర్ -6 పథకాల అమలుతో ప్రజల్లో ఏర్పడిన మంచి అభిప్రాయం.. టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీలపై కూడా ప్రజల్లో సానుకూలత పెంచిందన్నారు. చంద్రబాబు అనుభవం, ఆలోచనాతీరు తమకు, రాష్ట్రానికి మేలు చేస్తుందన్న ప్రజల నమ్మకాన్ని సూపర్-6 పథకాలు.. లక్షలకోట్ల పెట్టుబడులు రాక నిజం చేశాయన్నారు. మన నాయకుడి నాయకత్వ పటిమ, యువనేత లోకేశ్ సమర్థతతో పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయన్న ప్రత్తిపాటి.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ముందుకు సాగడం మనకు, రాష్ట్రానికి ఎంతో కీలకమన్నారు. ప్రజల్లో మన పనితీరు...ప్రవర్తన.. మాటతీరు మనపార్టీ ఓటు బ్యాంకు పెంచడంతో పాటు.. వైసీపీ సానుభూతిపరులు టీడీపీవైపు మొగ్గేలా ఉండాలని, చేపట్టి ప్రతి పని.. ప్రతి ఆలోచనలో ఇదే ప్రధానాంశంగా ఉండేలా పార్టీ శ్రేణులు వ్యవహరించాలన్నారు. మూడుపార్టీల శ్రేణుల ఐక్యత.. పనితీరును బట్టే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు అందించే విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
COMMENTS