• సర్వమానవాళి సంతోషాన్ని కాంక్షించే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి వరం • ప్రతిఒక్కరి సంతోషం.. ప్రతి కుటుంబానికి సంక్షేమం ప్రభుత...
• సర్వమానవాళి సంతోషాన్ని కాంక్షించే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి వరం
• ప్రతిఒక్కరి సంతోషం.. ప్రతి కుటుంబానికి సంక్షేమం ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనం
• క్రైస్తవులకు, ప్రజలకు, కూటమి పార్టీల శ్రేణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు
“ పవిత్ర క్రిస్మస్ పర్వదినం మీ కుటుంబాల్లో ఆనందాన్ని, శాంతిని, ప్రేమను, ఆ కరుణామయుని ఆశీస్సులతో ఎనలేని సుఖసంతోషాల్ని అందించాలని కోరుకుంటున్నాను. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సేవామార్గాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ, సమాజ, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు అవుదాం. ప్రతి ఒక్కరి సంతోషం, ప్రతి కుటుంబానికి సంక్షేమమే లక్ష్యంగా ప్రజారంజక పాలన సాగిస్తున్న కూటమిప్రభుత్వ విధానాలు, దూరదృష్టి లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. తమ స్వార్థ ప్రయోజనాలు, కుట్ర రాజకీయాలకు ప్రజల ఐక్యమత్యాన్ని విచ్ఛినం చేయాలని చూస్తున్న దుర్మార్గులకు దూరంగా ఉండాలి. ప్రపంచ పండుగ అయిన క్రిస్మస్ సందర్భంగా కూటమిప్రభుత్వం పాస్టర్లకు గౌరవవేతనం అందించడం, క్రైస్తవ సమాజానికి ఇస్తున్న ఎనలేని గౌరవమనే చెప్పాలి. 6,418 మంది పాస్టర్లకు రూ.50.50 కోట్లు విడుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడే తన సమర్థతను మరోసారి నిరూపించుకున్నారు. సర్వమానవాళి సంతోషాన్ని కాంక్షించే ఆయన నాయకత్వం ఆంధ్రరాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. గతంలో చర్చిల మరమ్మతులకు, పాస్టర్లకు గౌరవవేతనాలు అందించిన నాయకుడు చంద్రబాబు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించే నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబు పాలన, రాష్ట్రానికి ఆ జీసస్ ప్రసాదించిన కరుణగా చూడాలని ప్రజల్ని కోరుతున్నా.క్రైస్తవులకు, రాష్ట్ర ప్రజలకు, కూటమి శ్రేణులకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
COMMENTS