యడ్లపాడు మండల పరిధిలోని సందెపూడి గ్రామంలో సర్పంచ్ మద్దినీడి శివరామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలసమావ...
యడ్లపాడు మండల పరిధిలోని సందెపూడి గ్రామంలో సర్పంచ్ మద్దినీడి శివరామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలసమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి సమస్యలపై చర్చిస్తూ, వివిధ అభివృద్ధి అంశాలపై సూచనలు వినిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు మాట్లాడుతూ, గ్రామంలో ప్రస్తావించిన పలు సమస్యలను మాజీ మంత్రి మరియు శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన అన్నారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు కుర్ర రత్తయ్య,తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పోపూరి వెంకయ్య, తెలుగు రైతు జిల్లాఅధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు కందిమళ్ల రఘు రామారావు, సొసైటీ ఛైర్మన్ సుబ్బారావు, జాలాది నీటి సంఘం అధ్యక్షులు పోపూరి రాఘవయ్య, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు పాల్గొన్నారు.
COMMENTS