నాదెండ్ల మండల నూతన ఎస్సై గా ఆర్. వెంకటేశ్వర రావు నేడు బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై, యడ్లప...
నాదెండ్ల మండల నూతన ఎస్సై గా ఆర్. వెంకటేశ్వర రావు నేడు బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై, యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకులుగా పనిచేస్తూ, ఈ ప్రభుత్వంలో ఎస్సైగా ఎంపికయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసు స్టేషనులో పిఎస్సైగా పనిచేస్తున్న ఈయనకు తొలి నియామకం నాదెండ్ల పోలీసు స్టేషను అయింది. ఈ సందర్భంగా స్టేషను సిబ్బంది ఆయన ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. పలువురు గ్రామ సచివాలయాల సిబ్బంది వెంకటేశ్వరరావును కలిసి అభినందనలు తెలిపారు.
COMMENTS