చిలకలూరిపేట: పట్టణంలో గల ఏ.ఎం .జి సంస్థ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంస్థలోని వివిధ ...
చిలకలూరిపేట: పట్టణంలో గల ఏ.ఎం
.జి సంస్థ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంస్థలోని వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమార్ కంటి మహంతి మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగు తెచ్చింది అన్నారు.ఏఎంజి వ్యవస్థాపకులు సువార్తికులు జాన్ డేవిడ్ , డాక్టర్ సత్యవేదమ్మల ద్వారా ఏర్పడిన ఎఎంజి సంస్థ వేలాదిమంది కుటుంబాల్లో వెలుగులు నింపిందని అన్నారు. బిషప్ నందమూరి క్రిస్టరు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. దేవుడు తనకు తాను తగ్గించుకొని సమస్త మానవాళికి కోసం లోక రక్షకుడిగా మానవ రూపంలో క్రీస్తు జన్మించాడు .క్రీస్తు ప్రేమను కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ కేకులనుపంచారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఫార్ కార్నర్స్ అధినేత డాక్టర్ జెస్సి ఎస్ బర్నాబాస్ అధ్యక్షత వహించిగా, బోర్డు సభ్యులు సాంబయ్య , మోజస్ , పాస్టర్లు పీటర్ , ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
COMMENTS