చిలకలూరిపేట: పట్టణంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో, ప్రముఖ వైద్యురాలు డా. లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్...
చిలకలూరిపేట: పట్టణంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో, ప్రముఖ వైద్యురాలు డా. లావు సుష్మ ఆధ్వర్యంలో నడుస్తున్న లీలావతి హాస్పిటల్స్ ఇటీవల విజయవంతంగా ఉచిత ఓపెన్ ట్యూబెక్టమీ (Open Tubectomy) శిబిరాన్ని నిర్వహించింది.
ఈ శిబిరంలో, సంతానం చాలు అనుకున్న మహిళలకు కుటుంబ నియంత్రణలో భాగంగా అత్యంత ఆధునిక పద్ధతి అయిన ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించారు. డా. లావు సుష్మ మరియు వారి నిపుణులైన వైద్య బృందం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్స్ నిర్వాహకురాలు డా. లావు సుష్మ మాట్లాడుతూ, "పేదరికంలో ఉన్న వారికి ఇలాంటి ముఖ్యమైన సేవలను అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామని" తెలిపారు.
లీలావతి హాస్పిటల్స్ చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరం పట్ల పట్టణ ప్రజలు, ముఖ్యంగా సేవలు అందుకున్న మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, డా. లావు సుష్మకు కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS