చెన్నై: రైల్వే స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కేవలం ఏసీ కోచ్‌లలో మాత్రమే అందిస్...
చెన్నై: రైల్వే స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఇప్పటి వరకు కేవలం ఏసీ కోచ్‌లలో మాత్రమే అందిస్తున్న బెడ్‌రోల్ సదుపాయాన్ని ఇకపై సాధారణ స్లీపర్ కోచ్ ప్రయాణికులకూ అందించనుంది.అధికారుల వివరాల ప్రకారం, ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం చెన్నై డివిజన్ పరిధిలోని 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. బెడ్‌రోల్స్ కోసం ప్రయాణికులు తగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది — పూర్తి బెడ్‌రోల్ కోసం రూ.50, బ్లాంకెట్ మాత్రమే కావాలనుకుంటే రూ.20, పిల్లో కోసం రూ.10 వసూలు చేయనున్నారు.ఈ కొత్త సదుపాయం ద్వారా చెన్నై డివిజన్‌కు నెలకు సుమారు 28 లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రయోగాత్మక దశ విజయవంతమైతే, ఈ సేవను క్రమంగా ఇతర డివిజన్‌ల్లో కూడా విస్తరించే అవకాశముంది.
COMMENTS