విజయవంతం చేద్దాం మండేనని చరణ్ తేజ చిలకలూరిపేట:జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ...
విజయవంతం చేద్దాం మండేనని చరణ్ తేజ
చిలకలూరిపేట:జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రేపు, శుక్రవారం (ది. 05.12.2025) చిలకలూరిపేట పట్టణంలో పర్యటించనున్నారు.
'మెగా పేరెంట్స్ మీటింగ్ మెగా 3.0' కార్యక్రమంలో భాగంగా, స్థానిక శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న 'మెగా పేరెంట్స్ డే' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.ఈ సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికేందుకు జనసేన, కూటమి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కూటమి నాయకులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మండేనని చరణ్ తేజ.
ఈ కార్యక్రమం గురించి జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు, మండలనేని చరణ్ తేజ మాట్లాడుతూ"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రావడం మాకు చాలా సంతోషకరం. విద్యారంగంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో చెప్పే ఈ 'మెగా పేరెంట్స్ డే' కార్యక్రమాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరం కలిసికట్టుగా, విజయవంతం చేద్దాం. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది," అని ఆయన పేర్కొన్నారు.మండలనేని చరణ్ తేజ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
COMMENTS