ఎడ్లపాడు మండలంలోని దింతెనపాడు గ్రామంలోని స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఈరోజు మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 3.0 (Mega PTM 3.0) ఘనంగా నిర్వ...
ఎడ్లపాడు మండలంలోని దింతెనపాడు గ్రామంలోని స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఈరోజు మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 3.0 (Mega PTM 3.0) ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ స్కూల్ చైర్మన్ కొచ్చర్ల చందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు చదువు మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా గురువులే నేర్పిస్తారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు వారానికో లేదా నెలకోసారి పాఠశాలను సందర్శించి, తమ పిల్లల చదువుల పురోగతి మరియు మార్కులను పరిశీలించాలని సూచించారు. పాటశాల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులోని మార్కులను తల్లిదండ్రులు పరిశీలించి సంతకం చేయాలని కోరారు. అదే విధంగా ఆటపాటలపై కూడా పిల్లల భాగస్వామ్యం పెంచాలని ఆయన అన్నారు.కార్యక్రమం అనంతరం పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన విందులో చైర్మన్‌తో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.తదుపరి భాగంలో హెచ్ఎం జ్యోత్స్న, ఉపాధ్యాయుడు షేక్ బాజీవలి తల్లిదండ్రులతో సమావేశమై, విద్యార్థుల వ్యక్తిగత మార్కులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. తల్లిదండ్రుల వినతుల మేరకు ఉపాధ్యాయులు తగిన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం జ్యోత్స్న, ఉపాధ్యాయులు బాజీవలి, పంచాయతీ సెక్రటరీ నాగరాజా, మాజీ సర్పంచ్ చంద్రకళ రాజు, వైస్ సర్పంచ్ యెహోవాను, తల్లిదండ్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో ఉపాధ్యాయులు మాట్లాడుతూ, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థుల చదువుతో పాటు ఆటపాటల్లోను 100 శాతం కృషి చేస్తామని, ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధికి శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
COMMENTS