చిలకలూరిపేట: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వార్ష...
చిలకలూరిపేట: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్‌కు చేరుకున్న ఆయన, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు స్టేషన్ ప్రాంగణాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, నేరాల సంఖ్యను తగ్గించేందుకు సిబ్బంది పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు.క్షేత్రస్థాయిలో పోలీసులకు ఉన్న సిబ్బంది కొరత మరియు ఇతర సమస్యలను గుర్తించినట్లు తెలిపిన ఐజీ, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ నేర నియంత్రణకు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
COMMENTS