చిలకలూరిపేట: పట్టణ అభివృద్ధిలో భాగంగా బకాయి ఉన్న ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను మున్సిపల్ అధికారులు వేగవంతం చేశారు. మున్సిపల్ కమిష...
చిలకలూరిపేట: పట్టణ అభివృద్ధిలో భాగంగా బకాయి ఉన్న ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను మున్సిపల్ అధికారులు వేగవంతం చేశారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు జారీ చేసిన ఆదేశాల మేరకు, రెవెన్యూ ఆఫీసర్ (RO) సుబ్బారావు పర్యవేక్షణలో పట్టణంలోని పలు వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ ఖాదర్ మరియు గిరి, సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించారు.అధికారుల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక్కరోజే సుమారు రూ. 7.5 లక్షల మేర ఇంటి పన్ను వసూలు చేసినట్లు మున్సిపల్ వర్గాలు వెల్లడించాయి. పట్టణ అభివృద్ధి పనులకు సహకరించేలా ప్రజలందరూ తమ పన్ను బకాయిలను సకాలంలో చెల్లించి సహకరించాలని అధికారులు కోరారు.
COMMENTS