పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు, చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలనే సూచనలతో, ఈ రోజ...
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు, చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలనే సూచనలతో, ఈ రోజు (06.11.2025) మధ్యాహ్నం సుమారు 01:30 గంటల సమయంలో నరసరావు పేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిపాడు రోడ్డులోని A9 బ్యూటీస్ స్పా సెంటర్ పక్కన గల గృహంలో వ్యభిచారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందిన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల ఆదేశాల మేరకు నరసరావు పేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ షేక్.ఫిరోజ్ నేతృత్వంలో దాడి నిర్వహించడం జరిగింది.
రైడ్ సందర్భంగా వ్యభిచార కార్యకలాపాలలో పాల్గొంటున్న ఐదుగురిని (ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు) అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం వారిని తగిన చట్టపరమైన చర్యల కొరకు నరసరావు పేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
“పల్నాడు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందనీ, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని” ఎస్పీ హెచ్చరించారు.
COMMENTS