చిలకలూరిపేటలో కేసు నమోదు.... చిలకలూరిపేట పట్టణంలోని సి.ఆర్. కాలనీకి చెందిన ఓ వ్యక్తి పసుమర్రు గ్రామంలో టొబాకోస్ గుడౌన్ నిర్వహిస్...
చిలకలూరిపేటలో కేసు నమోదు....
చిలకలూరిపేట పట్టణంలోని సి.ఆర్. కాలనీకి చెందిన ఓ వ్యక్తి పసుమర్రు గ్రామంలో టొబాకోస్ గుడౌన్ నిర్వహిస్తున్నాడు. తాజాగా ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను గుంటూరు ఇన్కమ్ టాక్స్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ అని తనను పరిచయం చేసుకున్నాడు.ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ, బాధితుని ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో తేడాలు ఉన్నాయని, అతని బుక్స్ సిద్దం చేసుకోవాలని సూచించాడు. అదేవిధంగా,పరిశీలనకు వస్తామని, ఫైళ్ళు సరిగా లేకపోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించాడు. అనంతరం,పోలీసులు రాకుండా ఉండాలంటే 15 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశాడు. భయపడ్డ బాధితుడు ఆ మొత్తాన్ని పంపించడంతో మోసానికి గురయ్యాడు.ఈ ఘటనపై బాధితుడు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, రూరల్ ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికగా తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మి చెల్లింపులు చేయకుండా, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
COMMENTS