ముఖ్యమంత్రి సహాయ నిధి సాయంతో పేదల ప్రాణాలు నిలబడుతున్నందుకు, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ...
ముఖ్యమంత్రి సహాయ నిధి సాయంతో పేదల ప్రాణాలు నిలబడుతున్నందుకు, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఎంతో సంతోషంగా ఉందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆయన నివాసం నందు నాదెండ్లమండలానికి చెందిన పలువురు లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం.ఆర్.ఎఫ్) చెక్కులు పంపిణీ చేశారు.19 మంది లబ్ధిదారులకు రూ.7.1 లక్షల విలువైన నగదు చెక్కుల్ని స్వయంగా పంపిణీ చేశారు. అనారోగ్య బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలానే ముందస్తు చికిత్స నిమిత్తం పట్టణానికి చెందిన మూడవత్ లక్ష్మీ భాయి కి 70వేల రూపాయల LOC నీ అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారుపల్లి సత్యనారాయణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, వలేటి హిమవంతరావు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS