ప్రధాన మంత్రి అవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాల నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగాబుధవ...
ప్రధాన మంత్రి అవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాల నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగాబుధవారం చిలకలూరిపేట పట్టణంలో ఘనంగా గృహప్రవేశోత్సవాలు నిర్వహించారు.చిలకలూరిపేట గడియార స్తంభం బజారులో జరిగిన ప్రధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొని,నూతన గృహాలలో లబ్ధిదారులను గృహప్రవేశం చేయించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి అవాస్ యోజన ద్వారా ప్రతి అవసరమైన కుటుంబానికి సొంత గృహం కల్పించడం లక్ష్యమని,జిల్లాలో ఇప్పటివరకు నిర్మించిన గృహాలు నాణ్యత పరంగా ఆదర్శప్రాయంగా ఉన్నాయని తెలిపారు.ప్రతి లబ్ధిదారుడు సురక్షితమైన మరియు ఆత్మగౌరవంతో కూడిన వసతి పొందేలా వసతులు కల్పించామని ఆమె పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, గృహనిర్మాణం ద్వారా సామాన్య కుటుంబాల జీవిత స్థాయిలో విశేష మార్పు వచ్చిందని, పట్టణం నుంచి గ్రామం వరకు అభివృద్ధి దిశగా ప్రభుత్వం స్థిరంగా అడుగులు వేస్తోందని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, మహిళా సంఘాలు మరియు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. గృహప్రవేశం సందర్భంగా కొత్త ఇళ్ల ముందు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించగా, పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
COMMENTS