ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) డైరెక్టర్ గా వీరవల్లి వంశీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా, చి...
ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) డైరెక్టర్ గా వీరవల్లి వంశీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన సమన్వయకర్త తోట రాజ రమేష్, జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ మర్యాదపూర్వకంగా వీరవల్లి వంశీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు మరియు నాయకులు కూడా పాల్గొన్నారు. వీరంతా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీరవల్లి వంశీకి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.వీరవల్లి వంశీని ఏపీఆర్‌డీసీ డైరెక్టర్‌గా నియమించడం పట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
COMMENTS