మండల,నియోజకవర్గ స్థాయి పోటీలలో ఫస్ట్ ప్లేస్. ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు చ...
మండల,నియోజకవర్గ స్థాయి పోటీలలో ఫస్ట్ ప్లేస్.
ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్ట్ మరియు రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో తమ ప్రతిభతో సత్తా చాటారు.చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మండల స్థాయిలో మొదటి స్థానం సాధించారు. పదవ తరగతి విద్యార్థి కార్తీక్, తొమ్మిదో తరగతి విద్యార్థినులు లావణ్య లక్ష్మి, పి. నాగ వైష్ణవి సాయి చెకుముకి పోటీల్లో మండల స్థాయిలో ప్రధమస్థానంలో నిలిచారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీల్లో విద్యార్థి వి. క్రాంతి కుమార్ మండల స్థాయిలో మొదటి స్థానాన్ని, నియోజకవర్గ స్థాయిలో మూడవ స్థానాన్ని సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చాడు.పల్నాడు జిల్లా స్థాయిలో కూడా తమ ప్రతిభను ప్రదర్శిస్తారని ఉపాధ్యాయులు నమ్మకం వ్యక్తం చేశారు.విజేతలకు ప్రధానోపాధ్యాయులు ఏ.వి. నాయుడు, ఉపాధ్యాయులు కె. ఎలీషా, ఎం. రాజేశ్వరి,ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
COMMENTS