యడ్లపాడు: లేప్రోసి విభాగం స్టేట్ టీమ్ నుంచి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె. ఉషారాణి, జూనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. జయరా...
యడ్లపాడు: లేప్రోసి విభాగం స్టేట్ టీమ్ నుంచి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె. ఉషారాణి, జూనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. జయరామ కృష్ణ వారిద్దరూ ఈరోజు యడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నవంబరు 17 నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న ఎల్ సి డి సి కార్యక్రమం (లేప్రోసి వ్యాధి అనుమానితుల సర్వే) అమలుపై వారు వివరాలు సేకరించారు. వైద్యాధికారులు డాక్టర్ పి.భరద్వాజ, డాక్టర్ ఎం. ప్రభాకరరావు నుండి సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
పి హెచ్ సి యాక్షన్ ప్లాన్ ప్రకారం కారుచోల, యడ్లపాడు–1 ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి సూచనలు అందించారు.గ్రామ ప్రజలకు లేప్రోసి సర్వే అవసరాన్ని వివరించి, సర్వే ద్వారా గుర్తించిన అనుమానితులను ప్రతిరోజూ పీహెచ్సీ వద్ద పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అనంతరం ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పర్యటనలో పల్నాడు జిల్లా వైద్యఆరోగ్య శాఖ లేప్రోసి విభాగానికి చెందిన డి పి ఎం ఓ లు బి.ప్రభాకరరెడ్డి, జె.వి రమణారావు, వైద్యాధికారి డాక్టర్ పి.భరద్వాజ సహా ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS