పల్నాడు: జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అ...
పల్నాడు: జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. శనివారం ఉదయం ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.
సమావేశంలో జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారి గీతా రాణి మొట్ట మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకో వలసిన అంశాలను గురించి వివరించారు.తదనంతరం పల్నాడు జిల్లా ఎస్పి రోడ్డు ప్రమాదాల డేటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అన్ని చర్యలు తీసుకో వాలని కోరారు. అనంతరం జాతీయ భద్రత రహదారి ఉత్సవాలపై గోడపత్రికల ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆవిష్కరించారు.
ఎన్జీవో తరపున పల్నాడు జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులు ఆర్ కనకదుర్గ పద్మజ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు డ్రైవింగ్ శిక్షణ అవస రమని ముఖ్యంగా జిల్లా లో నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి రోడ్డు ప్రమాదాల రహిత డ్రైవర్ల ను తయారు చేయాలని కోరారు. అనంతరం పల్నాడు జిల్లాలో రోడ్డు సేఫ్టీ ఎన్జీవో సారధ్యంలో నిర్వహిస్తున్న ట్రాన్స్ పోర్ట్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వారికి ఖాకీ డ్రెస్సు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధులత, ఆర్టీసీ ఆర్.ఎం రజిత కుమారి,ఎక్సైజ్ శాఖ అధికారి,ఆర్టీవో, డీ.ఎం.హెచ్.వో డాక్టర్ రవి, నరసరావుపేట మున్సిపల్ శాఖ అధికారి జస్వంత్ రావు,స్టేట్ హైవే అధికా రులు, స్టేట్ ప్రొటెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS