ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట : జాతీయ పత్రిక దినోత్సవం,మరియ కార్తీక వన సమారాధననీ పురస్కరించుకొని ...
ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవ వేడుకలు
చిలకలూరిపేట : జాతీయ పత్రిక దినోత్సవం,మరియ కార్తీక వన సమారాధననీ పురస్కరించుకొని
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అనుబంధ సంస్థ అయిన ప్రెస్ క్లబ్, చిలకలూరిపేట యూనియన్ కుటుంబ సభ్యులు,ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో కలసి చీరాల రామాపురం బీచ్‌లో ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడపా అశోక్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. నిత్యం వార్తల వేటలో, ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉండే జర్నలిస్టులు, ఈ ఆత్మీయ సమ్మేళనం సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ సభ్యుల మాదిరిగా ఉల్లాసంగా గడపడానికి ఈ సమ్మేళనం వేదికగా నిలిచింది.ఈ సందర్భంగా, కార్యక్రమానికి హాజరైన పాత్రికేయులంతా మొదటగా ఉల్లాసంగా సముద్ర స్నానం చేశారు. సముద్రపు ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతూ, కొద్దిసేపు తమ వృత్తిపరమైన, వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ కాలక్షేపం కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం, అందరూ కలిసి ఒకే చోట కూర్చుని రుచికరమైన భోజనాలు చేశారు. పత్రికా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్ర స్థాయిలో అనుభవాలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మీయ సమ్మేళనం పత్రికా సోదరుల మధ్య మరింత బంధాన్ని, సహకారాన్ని పెంచేందుకు దోహదపడిందనీ చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ షేక్ ధరియావలి, ఏపీయూడబ్ల్యూజే మాజీ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలి,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వార్త ప్రసాద్,ఆలపాటి ఆంజనేయాలు,
తోట మల్లిఖార్జున రావు,సత్యం ,
సయ్యద్ సిద్ధిక్, గూడూరి సుబ్బు,దీవి దాసు మేడూరి ఆంజనేయాలు,వై శ్రీధర్.సి సి. సుభాని,కోచర్ల చందు, రావిపాటి రాజా,యాసం రవి కిరణ్, కే.రమేష్,ఎన్ .శ్రీకాంత్ ,కొనికి సాంబశివరావు,మనోహర్, సుందర్ బాబు, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS