చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘన నిరసన ర్యాలీ జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ నుం...
చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘన నిరసన ర్యాలీ జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ర్యాలీ ముగింపు వేడుకలో మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజిని,సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్సార్సీపీ తీవ్రంగాఖండిస్తోందని పేర్కొన్నారు.పేదలకు సంజీవనిలా ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను ప్రవేటీకరించే ప్రయత్నం చేయడం ప్రజా వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమయంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రవేటీకరణ పేరుతో అమ్ముకునే ప్రయత్నంలో ఉందని రజిని విమర్శించారు.పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించి వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆమె స్పష్టం చేశారు.
COMMENTS