చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ పరిధిలోని జగనన్న ప్లాట్స్ వద్ద జరుగుతున్న కోడిపందాలను పోలీసులు దాడి చేసి నలుగురిని పట్టుకున్నా...
చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ పరిధిలోని జగనన్న ప్లాట్స్ వద్ద జరుగుతున్న కోడిపందాలను పోలీసులు దాడి చేసి నలుగురిని పట్టుకున్నారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీలలో 2500 రూపాయల నగదు, రెండు కోడి పుంజులు మరియు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మండల పరిధిలో ఎవరైనా కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అనిల్ కుమార్ హెచ్చరించారు.
COMMENTS