రాష్ట్ర అధ్యక్షుడిగా ఏచూరి శివ ఏకగ్రీవ ఎన్నిక.. విజయవాడ:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అనుబంధ స...
రాష్ట్ర అధ్యక్షుడిగా ఏచూరి శివ ఏకగ్రీవ ఎన్నిక..
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అనుబంధ సంస్థ అయిన రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా మహాసభ శుక్రవారం నాడు విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు అత్యంత ఘనంగా జరిగింది.ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏచూరి శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
*చిలకలూరిపేట నేతల అభినందనలు...*
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు ఏచూరి శివను చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు మరియు ప్రింట్ మీడియా నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా వారు ఆయనను శాలువాతో సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.
COMMENTS