ఎడ్లపాడు: ఈనెల 21, 22 తేదీలలో నంద్యాలలో జరిగిన రీజనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్, ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అండ్ డాన్స్ కాంపిట...
ఎడ్లపాడు: ఈనెల 21, 22 తేదీలలో నంద్యాలలో జరిగిన రీజనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్, ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్‌లో ఎడ్లపాడు సెయింట్ ఆన్స్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు,జూనియర్ కాలేజ్ విద్యార్థినిలు క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చారు.త్రో బాల్, కోకో, కబడ్డీ విభాగాలలో సెయింట్ ఆన్స్ హై స్కూల్ బృందాలు రన్నర్లుగానిలిచాయి. అంతేకాక, ఇంటర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు డాన్స్ కాంపిటీషన్‌లో మొదటి బహుమతిని సాధించి ప్రత్యేక ఆకర్షణగానిలిచారు.విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ఎమ్మెల్యే మహమ్మద్ ఫరూక్ ట్రోఫీలు మరియు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా హై స్కూల్ హెచ్.ఎమ్. రోజా సిస్టర్, జూనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రీతి సిస్టర్ విజేతలైన విద్యార్థినీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు.కార్యక్రమంలో మదర్ జ్ఞానమేరి, స్టార్ సిస్టర్, శాంత సిస్టర్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.
COMMENTS