ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురపరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు, అనధికారంగా నిర్మించినభవనాలను రెగ్యులరైజ్ చేసుకునే అవక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురపరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు, అనధికారంగా నిర్మించినభవనాలను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బి.పి.యస్.–2025) ద్వారా కల్పించబడిందని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరిబాబుతెలిపారు.సమీపంలో జారీ చేసినజి.ఓ.యం.యస్.నెం.225, తేదీ 12.11.2025 ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ లోపు నిర్మించిన భవనాలను మాత్రమే అపరాధ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని ఆయనపేర్కొన్నారు. జి.ఓ. జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల లోపు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.ఇక నివాస భవనాల ఎత్తు 18 మీటర్లకు,వాణిజ్య భవనాల ఎత్తు 15 మీటర్లకు మించినట్లయితే ఫైర్ యన్.ఓ.సి. (Fire NOC) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అలాగే 31.08.2025 తరువాత నిర్మించిన భవనాలకు ఈ పథకం వర్తించదని స్పష్టంచేశారు. తప్పుడుసమాచారంతో దరఖాస్తు చేసుకునే ఇంజనీర్ల లైసెన్సులను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అనధికారభవనాలను చట్టబద్ధం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీ హరిబాబు విజ్ఞప్తి చేశారు.
COMMENTS