పల్నాడు జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు మరియు నేరచరిత్ర కలవారిపై పోలీసులు కఠిన చర్యలకు...
పల్నాడు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు మరియు నేరచరిత్ర కలవారిపై పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు చేసే పనులపై నిఘా ఉంటుందని, సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని వదిలి సమాజంలో మంచి పౌరులుగా మారాలని అధికారులుచెప్పారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో పోలీసులు హెచ్చరించడం జరిగినది.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పని సరిగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు పోలీసుల సూచనలను పాటించకుండా మరలా నేరానికి పాల్పడితే, వారిపై మరింతగా నిఘా వేసి, అవసరమైతే బైండోవరు చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా నరసరావుపేట సబ్ డివిజన్ ఆఫీసు ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ 1, 2, రూరల్, చిలకలూరిపేట, వినుకొండ, ఈపూరు, శావల్యాపురం ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లతో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించబడింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
COMMENTS