ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోనిలింగరావుపాలెం గ్రామంలో జరుగుతున్న కోతముక్క ఆట పై ఎడ్లపాడు పోలీసులు బుధవారం ప్రత్యేక దాడి నిర్వహ...
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోనిలింగరావుపాలెం గ్రామంలో జరుగుతున్న కోతముక్క ఆట పై ఎడ్లపాడు పోలీసులు బుధవారం ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ చర్యలో మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద నుంచి రూ. 10,240 నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ టి.శివరామకృష్ణ మాట్లాడుతూ అక్రమ జూదం సహా అన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఇటువంటి దందాలు ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి,తమ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్ఐ కోరారు.
COMMENTS