చిలకలూరిపేట పట్టణంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక చిన్న రథం సెంటరు వద్ద సైకిల్‌పై వెళ్తున్న సుమారు 50-60 ఏ...
చిలకలూరిపేట పట్టణంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక చిన్న రథం సెంటరు వద్ద సైకిల్‌పై వెళ్తున్న సుమారు 50-60 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,పరిస్థితి విషమం
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా (Critical) ఉందని వైద్యులు తెలియజేశారు. ప్రమాదానికి గురైన వ్యక్తి పేరు, వివరాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదానికి గురైన ఈ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిసిన వారు వెంటనే చిలకలూరిపేట పట్టణ పోలీసు స్టేషన్లో గానీ లేదా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ సంప్రదించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
COMMENTS