ముగ్గురి అరెస్ట్... చిలకలూరిపేట పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు శుక్రవారం దాడి చేసి, దానిన...
ముగ్గురి అరెస్ట్...
చిలకలూరిపేట పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యభిచార గృహంపై పోలీసులు శుక్రవారం దాడి చేసి, దానిని నిర్వహిస్తున్న మహిళతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. పట్టణం, గుండయ్యతోట నివాసి అయిన మన్నేపులి సుధా లక్ష్మి (భర్త: వెంకట కృష్ణ) బ్యాంక్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట పట్టణ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.సమాచారం మేరకు, చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. రమేష్ గారు తన పోలీస్ సిబ్బందితో కలిసి, మధ్యవర్తుల సమక్షంలో సదరు ఇంటిపై శుక్రవారం (ది. 28.11.2025) దాడి చేశారు.పోలీసులు జరిపిన దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మన్నేపులి సుధా లక్ష్మితో పాటు, వ్యభిచారానికి వచ్చిన ఇద్దరు విటులు – శ్రీగిరి రాజు ఉమా మహేశ్వరరావు, మరియు షేక్ మొహిద్దిన్ షరీఫ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది.
COMMENTS