చిలకలూరిపేట పట్టణంలోని పారిశుద్ధ్య పనులను ఈరోజు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫాని పరిశీలించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ...
చిలకలూరిపేట పట్టణంలోని పారిశుద్ధ్య పనులను ఈరోజు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫ్ఫాని పరిశీలించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లోని పండరీపురం, శారద హైస్కూల్ రోడ్డు, పెదనందిపాడు రోడ్డు, వేలూరు రోడ్డు, సి.ఆర్. కాలనీ మెయిన్ రోడ్డు మరియు ప్రధాన సెంటర్లలో పారిశుద్ధ్య స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.పట్టణ ప్రజలకు ఎటువంటి అశుభ వాతావరణం లేదా అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్యాన్ని కాపాడాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్య భద్రత దృష్ట్యా శుభ్రత పనులను నిరంతరంగా కొనసాగించాలంటూ అధికారులను చైర్మన్ ఆదేశించారు.
COMMENTS