స్కూటీపై వెళ్తున్న బాపట్ల వ్యక్తికి తీవ్ర గాయాలు..... చిలకలూరిపేట పట్టణంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం కంపెనీకి చెందిన...
స్కూటీపై వెళ్తున్న బాపట్ల వ్యక్తికి తీవ్ర గాయాలు.....
చిలకలూరిపేట పట్టణంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం కంపెనీకి చెందిన లారీ మరియు ఐచర్ బండి ఒక స్కూటీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి బాపట్లకు చెందినవాడు. స్కూటీపై వెళ్తున్న అతను ఒక్కసారిగా లారీ/ఐచర్ బెండి ఢీకొనడంతో కిందపడ్డాడు. ఆ సమయంలో, లారీకి సంబంధించిన ఇనుప స్టాండ్ స్కూటీపై ఉన్న వ్యక్తి కాళ్లకు తగిలి కణత భాగం నుంచి తీవ్రంగా కోసుకుపోయినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో బాధితుడికి కణత వద్ద తీవ్ర గాయాలై, రక్తం ధారగా స్రవించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
COMMENTS