చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని గణపవరంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా ఇంఛార్జి మంత్రి గొట్టిపాటి రవ...
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని గణపవరంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా ఇంఛార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్, జిల్లా కలెక్టరు కృతికా శుక్లా, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,తోట రాజా రమేష్, చైర్మన్ షేక్ కరిముల్లా తదితర ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పత్తి నాణ్యత, తూకా ప్రమాణాలు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు.
రైతులకు నష్టం లేకుండా నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు. పత్తి రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులకు మేలుచేసే విధానాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
COMMENTS