ప్రధాన అతిథిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఎడ్లపాడు మండల దింటేనపాడు గ్రామంలోని స్థానిక ఎంపీపీ పాఠశాలలో శనివారం టెల్సా (T...
ప్రధాన అతిథిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
ఎడ్లపాడు మండల దింటేనపాడు గ్రామంలోని స్థానిక ఎంపీపీ పాఠశాలలో శనివారం టెల్సా (TELSA) సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజం భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తోందని,ఆ సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యా కమిటీ చైర్మన్ కొచ్చర్ల చందు పర్యవేక్షణలో విద్యార్థులకు ఐదు రకాల నోట్‌బుక్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, భోజన ప్లేట్లు పంపిణీ చేశారు.తదనంతరం ప్రత్తిపాటి పుల్లారావు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏసీ రూములు, డిజిటల్ క్లాస్ సదుపాయాలను పరిశీలించి, దాతల సహకారం మరువలేనిదని తెలిపారు.కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించి,వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
COMMENTS