పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని కొండవీడులో తుపాను కారణంగా కొండచరియలు కూలిన నేపథ్యంలో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా కొన...
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని కొండవీడులో తుపాను కారణంగా కొండచరియలు కూలిన నేపథ్యంలో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా అటవీ అధికారిణి కృష్ణప్రియ ఆదివారం ఘాట్ రోడ్డులో జరుగుతున్న తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండలపై నుంచి ఊటనీటితో పాటు బండరాళ్లు జారే ప్రమాదం ఉన్నదని తెలిపారు.భద్రతా చర్యలలో భాగంగా ప్రస్తుతానికి ఘాట్ రోడ్డు మీద భారీ వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో ఘాట్ రోడ్డు మూసివేస్తున్నామన్నారు.పర్యాటకులు ఈ రెండు రోజుల్లో కొండవీడు దర్శనానికి రావద్దని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరువాత రాకపోకలను పునఃప్రారంభిస్తామన్నారు.
COMMENTS