చిలకలూరిపేట: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమయాల్లో పోగొట్టుకున్న 7 మొబైల్ ఫోన్‌లను అర్బన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశార...
చిలకలూరిపేట: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమయాల్లో పోగొట్టుకున్న 7 మొబైల్ ఫోన్‌లను అర్బన్ పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. గురువారం నాడు చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌లను బాధితులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా సెల్‌ఫోన్‌లు తిరిగి పొందిన బాధితులు సీఐ రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారు ఫోన్‌లు తిరిగి దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం మరింత పెరగాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు.
COMMENTS