చిలకలూరిపేట: చిలకలూరిపేట టౌన్-1 సెక్షన్ పరిధిలో విద్యుత్ చౌర్యంపై అధికారులు గురువారంనాడు విస్తృత దాడులు నిర్వహించారు. సి.ఆర్.డి....
చిలకలూరిపేట: చిలకలూరిపేట టౌన్-1 సెక్షన్ పరిధిలో విద్యుత్ చౌర్యంపై అధికారులు గురువారంనాడు విస్తృత దాడులు నిర్వహించారు. సి.ఆర్.డి.ఎ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎం. శ్రీనివాస్ నేతృత్వంలో గుంటూరు టౌన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు, డీ.పి.ఈ మరియు విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.ఎ. కరీమ్ ఆధ్వర్యంలో మొత్తం 36 బ్యాచ్‌లుగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో అనధికారికంగా అధిక లోడుతో విద్యుత్ వినియోగిస్తున్న 64 సర్వీసులపై రూ. 5,16,400, విద్యుత్ దొంగతనంలో పట్టుబడిన 2 సర్వీసులపై రూ. 80,000, అలాగే గృహ వినియోగ కనెక్షన్‌ను వాణిజ్య రీతిలో వాడుతున్న మరో 2 సర్వీసులపై రూ. 15,000 జరిమానా విధించారు.
మొత్తం రూ. 6,11,400 అపరాధ రుసుముగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.విద్యుత్ చౌర్యం ఒక సామాజిక నేరంగా పరిగణనలోకి వస్తుందని, దానిపై జైలు శిక్ష విధించబడవచ్చని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అనధికార వినియోగంపై కేసులు నమోదు చేసి, తరచుగా దాడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ ఆపరేషన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎ. గురునాథరావు, డి. శ్రీనివాసరావు, కె. రవికుమార్, 11 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట టౌన్-1 అసిస్టెంట్ ఇంజనీర్ యన్. కరుణాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
COMMENTS