చిలకలూరిపేటలో కేసు నమోదు చిలకలూరిపేట: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద నుంచి రూ. 5 కోట్ల నగదు వసూలు చేసిన ఘటనకు సంబంధించి...
చిలకలూరిపేటలో కేసు నమోదు
చిలకలూరిపేట: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద నుంచి రూ. 5 కోట్ల నగదు వసూలు చేసిన ఘటనకు సంబంధించి పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అర్బన్ సిఐ రమేష్ ఈ కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
*కేసు నమోదైన వారి పేర్లు*
* బత్తుల శ్రీ గణేష్
* కుమార స్వామి
* దొడ్డ రామకృష్ణ
* మానుకొండ శ్రీకాంత్ రెడ్డి
ఈ నలుగురు వ్యక్తులు నిరుద్యోగులను మోసగించి, భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.
COMMENTS