చిలకలూరిపేట: యువతను మత్తు మందుల బారి నుండి రక్షించాలనే లక్ష్యంతో చిలకలూరిపేట పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమం జరిగింది. స్థాని...
చిలకలూరిపేట: యువతను మత్తు మందుల బారి నుండి రక్షించాలనే లక్ష్యంతో చిలకలూరిపేట పట్టణంలో విస్తృత అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక శారదా స్కూల్ నందు చిలకలూరిపేట పట్టణ సీఐ రమేష్ సారథ్యంలో, అసిస్ట్ (ASSIST) సంస్థ సహకారంతో "మత్తు మందు నుండి యువతను కాపాడుదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ విద్యార్థులతో మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. నేటి సమాజంలో, ముఖ్యంగా ధనిక కుటుంబాలలో, "క్లబ్ కల్చర్" పేరుతో యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకోవడం కేవలం వ్యక్తిగత సమస్యే కాదని, అది వారి కుటుంబాలను, సమాజాన్ని కూడా నాశనం చేస్తుందని స్పష్టం చేశారు.డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలుడ్రగ్స్ నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని సీఐ రమేష్ తెలిపారు. డ్రగ్స్ నిరోధక చర్యల కోసం 'ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యార్థులకు తెలియజేశారు.డ్రగ్స్ తీసుకునేవారు ఎక్కడైనా కనిపించినా, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 1972 ను గుర్తు చేశారు. ఎవరైనా డ్రగ్స్ కనిపిస్తే, ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లయితే వెంటనే 1972 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో శారదా స్కూల్‌కు చెందిన బాలురు, బాలికలు సంఖ్యలో పాల్గొన్నారు.
COMMENTS