చిలకలూరిపేటలోని ఎన్నార్టీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు డ్రైవర్పై గుర్తుతెలియని యువకులు దాడి చేసిన సంఘటన జరిగింది. తిరుపతి ...
చిలకలూరిపేటలోని ఎన్నార్టీ సెంటర్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు డ్రైవర్పై గుర్తుతెలియని యువకులు దాడి చేసిన సంఘటన జరిగింది. తిరుపతి నుంచి సత్తెనపల్లి వెళ్తున్న ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీనివాసరావు టీ తాగేందుకు ఎన్నార్టీ సెంటర్‌లో ఆగారు.టీ స్టాల్ వద్ద డ్రైవర్ శ్రీనివాసరావుకు, కొందరు యువకులకు మధ్య జరిగిన గొడవ తీవ్రమైంది. ఈ గొడవలో యువకులు డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడి చేయగా, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాసరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం డ్రైవర్ పోలీసు స్టేషన్‌లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
COMMENTS